బాసరలో విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు మృతి | Four missing in Godavari river At Basara | Sakshi
Sakshi News home page

బాసరలో విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు మృతి

Jun 15 2025 12:29 PM | Updated on Jun 15 2025 6:07 PM

Four missing in Godavari river At Basara

సాక్షి, నిర్మల్‌: బాసరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోదావరి నదిలో పుణ్య స్నానికి దిగిన  ఐదుగురు భక్తులు మృతి చెందారు. వీరంతా హైదరాబాద్‌లోని బేగం బజార్‌కు చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. 

సీఐ మల్లేష్‌,ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబసభ్యులు మొత్తం 18మంది అమ్మవారి దర్శనం కోసం బాసరకు వచ్చారు. అయితే, దర్శనం అనంతరం పుణ్యస్నానాలు చేసేందుకు బోటుపై గోదావరి నది మధ్యలోకి వెళ్లారు. అక్కడికి వెళ్లగానే ఊహించిన ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో బోటులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు నదిలో మునిగిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న గజ ఈతగాళ్లు బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బాధితులు మృతిచెందారు. నది నుంచి వెలికి తీసిన మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement