నలుగురు అడిషనల్‌ ఎస్పీల బదిలీ

Four Additional Superindents Transfered In Hyderabad To Different Places - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: పోలీసుశాఖలో అడిషనల్‌ ఎస్పీలు (నాన్‌కేడర్‌)గా విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులు బదిలీ అయ్యారు. రా మగుండం అడిషనల్‌ డీసీపీ (ఆపరేషన్స్‌)గా ఉన్న పి.శోభన్‌కుమార్‌ను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అడిషనల్‌ ఎస్పీ (ఆపరేషన్స్‌)గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న కె.సురేశ్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమన్నారు. వరంగల్‌లో అడిషనల్‌ డీసీపీ (క్రైమ్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌)గా వి.తిరుపతిని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్‌ ఎస్పీ (ఆపరేషన్స్‌)గా బదిలీ చేశారు. అక్కడున్న అట్ల రమణారెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top