ఇందిరా మహిళా శక్తి ద్వారా సంచార చేపల విక్రయ వాహనాలు | fish vending vehicles through Indira Mahila Shakti: Seethakka | Sakshi
Sakshi News home page

ఇందిరా మహిళా శక్తి ద్వారా సంచార చేపల విక్రయ వాహనాలు

Dec 31 2024 12:30 AM | Updated on Dec 31 2024 12:30 AM

fish vending vehicles through Indira Mahila Shakti: Seethakka

3న ప్రారంభించనున్న మంత్రి సీతక్క  

సాక్షి, హైదరాబాద్‌: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచార చేపల విక్రయ వాహనాలను సమకూర్చుతోంది. మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశా లతో ఈ వాహనాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సిద్ధం చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల ద్వారా పలు వ్యాపారాలను ప్రారంభింపజేయనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 32 వాహనాలను మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా తయారు చేయి స్తున్నారు. 

ఒక్కో వాహనానికి రూ. 10 లక్షలు ప్రభుత్వం సమకూరుస్తోంది. జనవరి 3న వాహనాలను మంత్రి సీతక్క ప్రారంభించను న్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంతో అనుసంధానం చేసి.. 60 శాతం సబ్సిడీతో రూ. 4 లక్షలకే మహిళా సంఘాలకు ఈ వాహనాలు అందజేస్తారు. ఈ సబ్సిడీ మొత్తాన్ని సైతం బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలుగా సెర్ప్‌ ఇప్పించనుంది. గచ్చిబౌలిలోని నిథమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మహిళా సంఘాల సభ్యులకు సంచార చేపల విక్రయానికి సంబంధించిన శిక్షణను సెర్ప్‌ ఆధ్వర్యంలో ఉచితంగా అందించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement