బొల్లారం అగ్ని ప్రమాదం: అదుపులోకి మంటలు

Fires In Vindhya Organic Industry Have Been Complete Control - Sakshi

సాక్షి, హైదరాబాద్: వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. సంఘటన స్థలం నుండి వెళ్లిపోయిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెళ్లిపోగా, పరిశ్రమలో రెండు ఫైర్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో మొత్తం 3 బ్లాకులు కాగా, మొదటి బ్లాక్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు రెండు రీయాక్టర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఒక్కసారిగా రెండు రీయాక్టర్లు బ్లాస్ట్ కావడంతో భవనం మొత్తం నేలమట్టం అయ్యింది. (చదవండి: ఐడీఏ బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం)

ప్రొడక్షన్ యూనిట్‌లో ఉన్నవారికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 8 మంది గాయపడగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో మొత్తం 50 కి పైగా రీయాక్టర్లు ఉన్నాయి. ఈ పరిశ్రమలో వివిధ ప్రముఖ కంపెనీల రా మెటీరియల్ తీసుకొని బల్క్ డ్రగ్స్ తయారు చేస్తారు. ప్రమాదంపై పోలీసులు, రెవెన్యూ, కెమికల్ ఇండ్రస్టీస్ ఇన్స్పెక్షన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇక హైదరాబాద్‌లో ఫ్రీ వాటర్‌.. అయితే..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top