జగిత్యాలలో ఉద్రిక్తత.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్ 

Farmers Protest At Jagtial, MLC jeevan Reddy House Arrest - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : జగిత్యాల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. మొక్కజొన్న, వరి దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని ‘ఛలో’ కలెక్టరేట్ పేరుతో రైతులు చేపట్టిన మహార్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమలు చేస్తూ ఎక్కడికక్కడ రాజకీయ పార్టీల నాయకులను గృహనిర్బంధం చేసి రైతులను ముందస్తు అరెస్టు చేశారు. అయితే రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొంతమంది రైతులు కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా చేపట్టారు. చదవండి: ‘కోవాక్సీన్‌’ బిహార్‌ కోసమేనట! 

పోలీసులు రైతు సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేసి డీసీఎం వ్యాన్‌లో తీసుకెళుతుండగా రైతులు అడ్డుకున్నారు. బ్యాంక్ అడ్డంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కొందరు వ్యాన్‌పై రాళ్లు రువ్వడంతో వ్యాన్ అద్దాలు ద్వంసం అయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. జగిత్యాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్ చేశారు. చదవండి: కార్మిక నేతకు తుది వీడ్కోలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top