ముందస్తు నోటీసులివ్వకపోవడం తప్పే

ERC Chairman Tanneru Sriranga Rao About ACD Charges - Sakshi

ఏసీడీ చార్జీలతో ప్రభుత్వానికి సంబంధం లేదు

ఈఆర్‌సీ చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు 

మంచిర్యాల అగ్రికల్చర్‌: ముందస్తు వినియోగ ధరావతు (ఏసీడీ) చార్జీల వసూలులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఈఆర్‌సీ అనుమతితోనే విద్యుత్‌ సంస్థ వినియోగదారుల నుంచి వసూలు చేస్తోందని ఈఆర్‌సీ చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు స్పష్టం చేశారు. మంచిర్యాలలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం జిల్లా విద్యుత్‌ వినియోగదారులతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వినియోగదారులకు ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడం విద్యుత్‌ సంస్థ తప్పేనన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే రైతులు రవాణా, మరమ్మతు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆలస్యమైనప్పుడు  సొంతంగా తీసుకొస్తే చార్జీల కింద సంస్థ రూ.700 చెల్లిస్తుందని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top