ఈపీఎఫ్‌ చందాదారులకు గుడ్‌ న్యూస్.. పెన్షన్‌ పెంపు!

EPS Pension Increase For Employees EPFO - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఉద్యోగుల పెన్షన్‌ పథకం (ఈపీఎస్‌) కింద అధిక పెన్షన్‌ అమలుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఉపక్రమించింది. ఈపీఎఫ్‌ చందాదారులు పదవీ విరమణ తర్వా త ఇప్పటివరకు అత్యంత పరిమితంగానే నెలవారీ పెన్షన్‌ పొందుతున్నారు. తాజాగా ఉద్యోగి పదవీ విరమణ నాటికి ఉన్న వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్‌ రూపంలో చెల్లించేందుకు చేసిన సవరణ అమలు కానుంది.

2014 నాటి సవరణ ప్రకారం పెన్షన్‌ రూ.6,500 నుంచి రూ.15 వేల మధ్యలో పొందేందుకు అవకాశం కల్పించారు. అయితే ఈ పెంపును వేతన పరిమితి ఆధారంగా నిర్ణయించేలా గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచి్చన ఆదేశా లకు లోబడి వర్తింపజేసేందుకు ఈపీఎఫ్‌ఓ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సోమవారం ఈపీఎఫ్‌ఓ జోనల్‌ కార్యాలయాల్లోని అదనపు చీఫ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్లు, ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజినల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్లకు సర్క్యూలర్‌ చేసింది.  

సేవా విభాగం ఏర్పాటుకు ఆదేశం 
ఉద్యోగులు, యాజమాన్యాలు ఉమ్మడి ఆప్షన్‌ దర ఖాస్తును ఈపీఎఫ్‌ఓ క్షేత్ర కార్యాలయాలకు సమర్పించాలని సంస్థ ఆదేశించింది.  ఉద్యోగుల అవగా హనకు ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్లు ప్రకటనను నోటీసుబోర్డులో ఉంచాలని, అ«ధిక పెన్షన్‌ కోసం సేవావిభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రతి జాయింట్‌ ఆప్షన్‌ అప్లికేషన్‌ను రిజిస్టర్‌ చేసి, డిజిటల్‌గా లాగ్‌ఇన్‌ చేసి, రసీదు సంఖ్యను ఉద్యోగికి అందించాలని సూచించింది. సీలింగ్‌ కన్నా ఎక్కువ వేతనమున్న ఉద్యోగులు అధిక పింఛన్‌ కోసం సమర్పించే దరఖాస్తును ప్రాంతీయ పీఎఫ్‌ వో అధికారులు పరిశీలించి, నిర్ణయాన్ని పోస్టు ద్వారా, ఈమెయిల్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపాలి.  

ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాలి  
ఈపీఎస్‌ అధిక పెన్షన్‌కు అర్హులైన ఉద్యోగులంతా సంబంధిత ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాలి. జాయింట్‌ ఆప్షన్‌ దరఖాస్తు విధానం, వివరాలు, గడువు తేదీని సంబంధిత ఆర్‌పీఎఫ్‌సీ వెల్లడిస్తారు. అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన తరువాత ఉద్యోగుల భవిష్యనిధి నుంచి పింఛను నిధికి అవసరమైన నగదు సర్దుబాటు, అదనపు నిధి డిపాజిట్‌ విషయమై ఉమ్మడి ఆప్షన్‌ ఫారంలో ఉద్యోగి అంగీకారం కచి్చతంగా వెల్లడించాలి.  అధిక పెన్షన్‌ అమలుపై యాజమాన్యాలకు అవగాహన కలి్పంచడం, సమస్యలను పరిష్కరించడం, సందేహాల నివృత్తిరి ఈపీఎఫ్‌వో కార్యాలయ అధికారులు అందుబాటులో ఉంటారు.
చదవండి: రాష్ట్రంలోనే మొదటి గాడిదల డెయిరీ ఫామ్.. లీటరు ధర రూ. 4 నుంచి 5 వేలు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top