రేపు సెలవు ఇవ్వడం లేదు.. ఈసీకి వరుస ఫిర్యాదులు | Sakshi
Sakshi News home page

రేపు సెలవు ఇవ్వడం లేదు.. ఈసీకి వరుస ఫిర్యాదులు

Published Wed, Nov 29 2023 6:22 PM

employees complaining ec over no holiday on poll day - Sakshi

హైదరాబాద్‌: రేపు (నవంబర్‌ 30) జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదంటూ ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు వెల్లువెత్తాయి. 

నగరంలోని పలు ఎంఎన్‌సీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఎలక్షన్‌ కమిషన్‌కు సంబంధించిన ఓటర్‌ హెల్ప్‌లైన్‌ 1950 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటేసేందుకు గురువారం తమ కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదని వాపోతున్నారు. పని చేయాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారని, ఉద్యోగం కావాలా? ఓటు కావాలా? అంటున్నారని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ ఓటు వేసేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పోలింగ్‌ రోజున సెలవు ఇవ్వాలని ఎలక్షన్‌ కమిషన్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు తమకు సెలవు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు.

Advertisement
Advertisement