స్కాన్‌ చెయ్యి.. కానుక వెయ్యి..

E Hundi Has Arranged For Devotees In Siddipet Temple - Sakshi

నాచగిరి భక్తులకు ఈ–హుండీ ఏర్పాటు 

వర్గల్‌(గజ్వేల్‌): గుడికొచ్చాం.. దేవుడిని దర్శించుకున్నాం.. అయ్యో హుండీలో వేసేందుకు చిల్లర లేదే.. అని జేబులు తడుముకోవాల్సిన అవసరం లేదంటున్నారు సిద్దిపేట జిల్లా.. నాచారం గుట్ట నాచగిరి శ్రీలక్ష్మీనృసింహక్షేత్ర అధికారులు. ప్రతిచోట ఫోన్‌ పే, గూగుల్‌ పే, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా డిజిటల్‌ ద్వారా డబ్బులు చెల్లిస్తున్న కాలమిది. ఇందుకు అనుగుణంగా నాచగిరి సందర్శనకు వచ్చే భక్తుల కోసం ‘ఈ–హుండీ’ ఏర్పాటు చేశారు.

ఇందుకోసం ఎస్‌బీఐలో ఖాతా తెరిచి క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేయించారు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసేందుకు నాచగిరీశుని గర్భాలయం ముందర హుండీకి అతికించారు. భక్తులు దైవదర్శనం చేసుకుని ఫోన్‌ద్వారా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ‘ఈ–హుండీ’లో కానుక సమర్పించుకుంటున్నారు. జేబులో డబ్బులు లేవనే బాధ లేకుండా మంచి ఏర్పాట్లు చేశారని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top