breaking news
Digital cash
-
స్కాన్ చెయ్యి.. కానుక వెయ్యి..
వర్గల్(గజ్వేల్): గుడికొచ్చాం.. దేవుడిని దర్శించుకున్నాం.. అయ్యో హుండీలో వేసేందుకు చిల్లర లేదే.. అని జేబులు తడుముకోవాల్సిన అవసరం లేదంటున్నారు సిద్దిపేట జిల్లా.. నాచారం గుట్ట నాచగిరి శ్రీలక్ష్మీనృసింహక్షేత్ర అధికారులు. ప్రతిచోట ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా డిజిటల్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్న కాలమిది. ఇందుకు అనుగుణంగా నాచగిరి సందర్శనకు వచ్చే భక్తుల కోసం ‘ఈ–హుండీ’ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఎస్బీఐలో ఖాతా తెరిచి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసేందుకు నాచగిరీశుని గర్భాలయం ముందర హుండీకి అతికించారు. భక్తులు దైవదర్శనం చేసుకుని ఫోన్‌ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ‘ఈ–హుండీ’లో కానుక సమర్పించుకుంటున్నారు. జేబులో డబ్బులు లేవనే బాధ లేకుండా మంచి ఏర్పాట్లు చేశారని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఏకీకృత ప్లాట్‌ఫాంతో బ్యాంకింగ్ సేవలు సులభం
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ నగదు కార్యకలాపాల్ని ప్రోత్సహించే లక్ష్యంతో బ్యాంకుల కోసం ఆధునీకరించిన ‘ఏకీకృత చెల్లింపుల ఇంటర్ఫేస్’(యూపీఐ)ను అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ కొత్త సాంకేతిక సదుపాయం వల్ల వినియోగదారులు తక్కువ ఖర్చుతో, మరింత భద్రతతో కూడిన లావాదేవీలు జరపొచ్చని ఆ శాఖ పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకులు వేటికవే విడివిడిగా తమ సొంత ప్లాట్‌ఫాంలు వినియోగిస్తున్నాయి. ఎస్బీఐ, పీఎన్బీ, కెనరా బ్యాంకులకు సొంత పేమెంట్ ప్లాట్‌ఫాంలున్నాయి. అరుుతే ఏకీకృత ప్లాట్‌ఫాం అందుబాటులోకి వస్తే ఖాతాదారులకు బ్యాంకింగ్ కార్యకలాపాలు సులభమవ్వడమే కాకుండా... సమాచారం చాలా సురక్షితంగా ఉంటుంది. కొత్త విధానంతో మొబైల్ ఫోన్లను దాదాపు డెబిట్ కార్డులుగా ఉపయోగించుకోవచ్చు. నగదును పంపడం, అందుకోవడం నిమిషాల్లో పని, అలాగే అనేక ఫీచర్లు కూడా వినియోగదారులకు అందుబాటులోకి వస్తారుు.