ఏకీకృత ప్లాట్‌ఫాంతో బ్యాంకింగ్ సేవలు సులభం | Banking services are easy | Sakshi
Sakshi News home page

ఏకీకృత ప్లాట్‌ఫాంతో బ్యాంకింగ్ సేవలు సులభం

Dec 5 2016 1:37 AM | Updated on Sep 4 2017 9:54 PM

దేశంలో డిజిటల్ నగదు కార్యకలాపాల్ని ప్రోత్సహించే లక్ష్యంతో బ్యాంకుల కోసం ఆధునీకరించిన ‘ఏకీకృత చెల్లింపుల ఇంటర్‌ఫేస్’(యూపీఐ)ను అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించింది.

న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ నగదు కార్యకలాపాల్ని ప్రోత్సహించే లక్ష్యంతో బ్యాంకుల కోసం ఆధునీకరించిన ‘ఏకీకృత చెల్లింపుల ఇంటర్‌ఫేస్’(యూపీఐ)ను అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ కొత్త సాంకేతిక సదుపాయం వల్ల వినియోగదారులు తక్కువ ఖర్చుతో, మరింత భద్రతతో కూడిన లావాదేవీలు జరపొచ్చని ఆ శాఖ పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకులు వేటికవే విడివిడిగా తమ సొంత ప్లాట్‌ఫాంలు వినియోగిస్తున్నాయి. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, కెనరా బ్యాంకులకు సొంత పేమెంట్ ప్లాట్‌ఫాంలున్నాయి.

అరుుతే ఏకీకృత ప్లాట్‌ఫాం అందుబాటులోకి వస్తే ఖాతాదారులకు బ్యాంకింగ్ కార్యకలాపాలు సులభమవ్వడమే కాకుండా... సమాచారం చాలా సురక్షితంగా ఉంటుంది. కొత్త విధానంతో మొబైల్ ఫోన్లను దాదాపు డెబిట్ కార్డులుగా ఉపయోగించుకోవచ్చు. నగదును పంపడం, అందుకోవడం నిమిషాల్లో పని, అలాగే అనేక ఫీచర్లు కూడా వినియోగదారులకు అందుబాటులోకి వస్తారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement