
ఖమ్మం: జిల్లా కేంద్రంలో కుక్కల బెడద తీవ్రంగా మారింది. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ కుక్కలు సంచరిస్తుండటంతో పాదచారులు, వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ మనుషులను కరుస్తున్నాయి. పాదచారులు, వాహనచోదకుల వెంట పడుతుండటంతో వారు కంగారు పడుతున్నారు. ఖమ్మం నగరంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా ఇటీవల రోజుకు పదివరకు కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి.