కుక్క మెడకు తాడు కట్టి 5 కిలోమీటర్లు..  | Dog Is Not Sitting On Bike After A Man Locked Bike Back | Sakshi
Sakshi News home page

కుక్క మెడకు తాడు కట్టి 5 కిలోమీటర్లు.. 

Dec 14 2021 2:01 PM | Updated on Dec 14 2021 2:09 PM

Dog Is Not Sitting On Bike After A Man Locked Bike Back  - Sakshi

మాచారెడ్డి: పందుల కాపలా కోసం కొనుగోలు చేసిన కుక్క బైక్‌పై కూర్చోకపోవడంతో దాని మెడకు వైర్‌ తాడు కట్టి బైక్‌ను నడుపుతూ 5 కిలోమీటర్లు లాక్కెళ్లాడు ఓ వ్యక్తి. దీంతో కుక్క మెడకు గాయమైంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి వద్ద వెయ్యి రూపాయలువెచ్చించి కుక్కను కొనుగోలు చేశాడు. అనంతరం దాన్ని బైక్‌ వెనుక లాక్కెళ్లాడు. గమనించిన పలువురు జంతు ప్రేమికులు ఆ వ్యక్తిని వెంబడించి చివాట్లు పెట్టారు. ఎట్టకేలకు దాన్ని బైక్‌పై ఎక్కించి కొమురయ్యను హెచ్చరించి పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement