మంత్రులు, ఎమ్మెల్యేలపై.. మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు | DCC's complain to Meenakshi Natarajan about ministers and MLA | Sakshi
Sakshi News home page

మంత్రులు, ఎమ్మెల్యేలపై.. మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు

Jul 17 2026 11:16 AM | Updated on Jul 17 2026 11:22 AM

DCC's complain to Meenakshi Natarajan about ministers and MLA

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ డీసీసీలతో నిర్వహించిన సమీక్షలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మంత్రుల, ఎమ్మెల్యేల సహాకారం తమకు ఎంతమాత్రం లేదని డీసీసీలు మీనాక్షికి ఫిర్యాదు చేశారు.  రాష్ట్రంలో సర్‌ కొనసాగుతున్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు ఇంఛార్జ్ ఎదుట తమ గొడు వెల్లగక్కారు. 

అయితే ఇప్పుడు రాష్ట్రంలో సర్ ప్రక్రియ నడుస్తోన్నందున అది ముగిసే వరకూ దానికే ప్రాధాన్యత ఇవ్వాలని నేతలకు తెలిపినట్లు సమాచారం.అర్హులైన ఏ ఒక్కరిని ఓట్ల జాబితానుండి తొలగించకుండా చర్యలు తీసుకోవాలని బీఎల్‌ఏలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. 

రాష్ట్రంలో సర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement