కరోనాతో మృతి: కన్న కూతురే అంత్యక్రియలకు రాలే | Daughter Did Not Attend Mother's Funeral | Sakshi
Sakshi News home page

కరోనాతో మృతి: కన్న కూతురే అంత్యక్రియలకు రాలే

Apr 18 2021 4:17 AM | Updated on Apr 18 2021 7:53 AM

Daughter Did Not Attend Mother's Funeral - Sakshi

పరకాల: వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధి రాజిపేటలో ఓ వృద్ధురాలు (75) కరోనాతో శనివారం మృతి చెందింది. స్థానికంగా ఉండే ఆమె ఏకైక కుమార్తెకు విషయం తెలిసినా రాకపోగా మిగతా బంధువులూ స్పందించలేదు. దీంతో కౌన్సి లర్‌ దామెర మొగిలి మున్సిపల్‌ సిబ్బంది సాయం తో మృతదేహాన్ని ఖననం చేయించారు. పీపీఈ కిట్లు ధరించి వృద్ధురాలి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో శ్మశాన వాటికకు తరలించి ఖననం చేశారు.  

చదవండి: షాకింగ్‌: కరోనా సోకిందని సూటిపోటి మాటలు.. ఆత్మహత్య

Advertisement
 
Advertisement
Advertisement