దారుణం.. బైక్‌ను ఢీకొట్టడంతో భార్యాభర్తలిద్దరూ లారీ కింద ఇరుక్కుని.. | Dangerous Road Accident At Sangareddy District | Sakshi
Sakshi News home page

దారుణం.. బైక్‌ను ఢీకొట్టడంతో భార్యాభర్తలిద్దరూ లారీ కింద ఇరుక్కుని..

Feb 12 2023 10:57 AM | Updated on Feb 12 2023 12:30 PM

Dangerous Road Accident At Sangareddy District - Sakshi

హత్నూర(సంగారెడ్డి): బైక్‌ను లారీ ఢీ కొన్న ఘటనలో భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఊట్ల శ్రీకాంత్, అర్చన భార్యాభర్తలు. శుక్రవారం పటాన్‌ చెరు మండలం ఇస్నాపూర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం స్వగ్రామమైన మెదక్‌ జిల్లా వెంకట్రావ్‌ పెట గ్రామానికి పల్సర్‌ బైక్‌ పై బయలుదేరారు. దౌల్తాబాద్‌ లోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ ఉండటంతో  శ్రీకాంత్‌ బైక్‌ను స్లో చేశాడు. ఈ క్రమంలో  వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఒక్కసారిగా వారి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. 

దీంతో భార్యాభర్తలిద్దరూ కింద పడిపోయారు. వారిద్దరినీ లారీ కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. లారీ టైర్ల కింద ఇరుక్కుపోయిన వారిని స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ వారిని పోలీసు వాహనంలో నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయనున్నట్లు  తెలిపారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement