యూట్యూబ్‌లో లైక్, కామెంట్, షేర్‌ చేయాలంటూ వల.. ఒక్క రోజులో రూ. కోటి స్వాహా!

Cyber Crime Youtube Like Share Comment Fraud - Sakshi

హిమాయత్‌నగర్‌: ఒక్క రోజులో సైబర్‌ కేటుగాళ్లు రూ.కోటి కొట్టేశారు. డబ్బు పోగొట్టుకున్న బాధితులు శనివారం సైబర్‌క్రైం పోలీసు స్టేషన్‌కు క్యూ కట్టారు. సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–12లో నివాసం ఉండే వైద్యురాలికి కొద్దిరోజుల క్రితం టెలిగ్రాంలో ఓ యువతి పరిచయమైంది. తాము పంపించే యూట్యూబ్‌ లింకులను ఓపెన్‌ చేసి దానిలోని వీడియోను లైక్, కామెంట్‌తో పాటు షేర్‌ చేస్తే ఒక్కో లైక్‌కు రూ.500, కామెంట్‌కు రూ.1,000, షేర్‌ చేస్తే రూ.2 వేలు ఇస్తామన్నారు.

తొలిరోజుల్లో లాభాలు ఇచ్చారు. వీరి మధ్య సాన్నిహిత్యం బలపడింది. దీంతో ఇన్వెస్ట్‌మెంట్‌ వైపు ఆమెను ఆహా్వనించింది. దీనికి ఒప్పుకున్న వైద్యురాలికి ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా తొలుత లాభాలు ఇచ్చారు. ఆ తర్వాత పెట్టిన పెట్టుబడికి టాస్క్‌లు ఉన్నాయంటూ చెబుతూ పలు దఫాలుగా రూ.64 లక్షలు దోచుకున్నారు. మరో వ్యక్తి ఆమెజాన్‌ గిఫ్ట్‌ కూపన్స్‌ కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో ఇతరులకు విక్రయిస్తుంటాడు. కేవైసీ తీసుకున్న వారికే గిఫ్ట్‌ కూపన్స్‌ను బల్‌్కలో కొంతకాలంగా ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్నాడు. 

బల్క్‌లో తీసుకున్న కొందరు డబ్బు వేస్తున్నట్లు నటించి డబ్బు వేయలేదు. రెండు నెలల వ్యవధిలో కేవైసీ ఇచి్చన ఇద్దరు వ్యక్తులు రూ.34 లక్షలు కాజేశారు. మరో ఐదుగురి నుంచి సైబర్‌ నేరగాళ్లు  ఓటీపీలు, ఇన్వెస్ట్‌మెంట్లు అంటూ దాదాపు రూ.10 లక్షలు స్వాహా చేశారు. ఇలా శనివారం ఒక్కరోజే కోటికి పైగా డబ్బు పోగొట్టుకున్న వారు సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు.
చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top