ఒకే గ్రామం.. రెండు నిబంధనలు

Crowd  Worry About Two Lockdowns in Same Village - Sakshi

అయోమయంలో ప్రజలు  

హైదరాబాద్‌: రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న ఆ గ్రామంలో రెండు లాక్‌డౌన్‌లు అమలవుతుండడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. హైదరాబాద్‌–నాగార్జునసాగర్‌ రహదారిపై రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సరిహద్దుల్లో మాల్‌ గ్రామం ఉంది. రెండు జిల్లాల వారికి ఈ గ్రామం పెద్ద వ్యాపార కేంద్రం. ప్రతి మంగళవారం యాచారం మండల పరిధిలోని మాల్‌లో పశువుల సంత, చింతపల్లి మండల పరిధిలోని మాల్‌లో సంత జరుగుతుంది.

ప్రస్తుతం రెండు జిల్లాలకు వేర్వేరు లాక్‌డౌన్‌లు అమలు అవుతుండడంతో రంగారెడ్డి జిల్లా పరిధిలోని మాల్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, నల్గొండ జిల్లా పరిధిలోని మాల్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్‌డౌన్‌ అమలవుతుంది. దీంతో గ్రామస్తులతో పాటు వ్యాపారులు అయోమయానికి గురవుతున్నారు. నల్గొండ జిల్లా పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అధికంగా మధ్యాహ్నం వరకే వ్యాపార సంస్థలను మూసేస్తున్నారు. 

చింతపల్లిమండల పరిధిలోని మాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకే దుకాణాల మూసివేత  

ఇక్కడ చదవండి: హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమే: ఈటల
దిక్కులేని వారయ్యాం.. ఆదుకోండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top