డీఎస్పీగా క్రికెటర్‌ సిరాజ్‌ బాధ్యతల స్వీకారం | Cricketer Mohammed Siraj takes charge as Telangana DSP | Sakshi
Sakshi News home page

డీఎస్పీగా క్రికెటర్‌ సిరాజ్‌ బాధ్యతల స్వీకారం

Oct 12 2024 4:12 AM | Updated on Oct 12 2024 4:12 AM

Cricketer Mohammed Siraj takes charge as Telangana DSP

సాక్షి, హైదరాబాద్‌: భారత క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. టీ20 ప్రపంచ కప్‌ గెలిచిన భారత క్రికెట్‌ బృందంలో సభ్యునిగా టీమ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్‌కు గ్రూప్‌–1 ఆఫీసర్‌ పోస్టును ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం విదితమే. ముఖ్యమంత్రి ఇచి్చన హామీ మేరకు ఆయనను పోలీసు శాఖలో డీఎస్పీగా నియమించారు.

శుక్రవారం ఆయన డీజీపీ జితేందర్‌కు రిపోర్ట్‌ చేసి, డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. సిరాజ్‌ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో రాజ్యసభసభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, తెలంగాణ మైనారిటీస్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ చైర్మన్‌ ఫహీముద్దీన్‌ ఖురేషీ పాల్గొన్నారు. తనను డీఎస్పీగా నియమించినందుకు ఈ సందర్భంగా సిరాజ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీజీ మహేశ్‌భగవత్, ఐజీ ఎం.రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement