మందు నింపకుండానే సూది | Covid Vaccine Injection: Medical Staff Negligence In Medak | Sakshi
Sakshi News home page

మందు నింపకుండానే సూది

Dec 7 2021 1:12 PM | Updated on Dec 7 2021 1:12 PM

Covid Vaccine Injection: Medical Staff Negligence In Medak - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హుస్నాబాద్‌(మెదక్‌): మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం నవ్వులాటగా మారింది. సిరంజిలో మందు నింపకుండానే ఖాళీ సూది ఇచ్చిన తీరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పట్టణానికి చెందిన కేడం సుచిత్ర కరోనా రెండో డోస్‌ కోసం సోమవారం హుస్నాబాద్‌ ఆస్పత్రికి వచ్చింది. ఈ క్రమంలో సిరంజిలో వ్యాక్సిన్‌ మందు నింపి సూది  వేయాల్సిన వైద్య సిబ్బంది, మందు నింపకుండానే ఎడమ చేతికి ఇంజక్షన్‌ ఇచ్చారు.

పక్కనే ఉన్న సు చిత్ర తమ్ముడు ఇదేమిటని ప్రశ్నించగా, తెరుకున్న సిబ్బంది తిరిగి కరోనా వ్యాక్సిన్‌ మందు నింపి మళ్లీ కుడి చేతికి టీకా ఇచ్చారు. ముచ్చట్లలో పడిన సిబ్బంది మందు నింపారో లేదో చూసుకోకుండానే çసూది ఇవ్వడంపై అక్కడున్నవారు వాపోయారు. దీనిపై వివరణ అడగగా మరోసారి పొరపాటు జరకుండా చూస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. దీనిపై ఆస్పత్రి వైద్యాధికారి సౌమ్యను ఫోన్‌లో స్పందించగా, స్పందించలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement