3 రోజులుగా జ్వరం ఉంటే టెస్ట్‌ తప్పనిసరి: డాక్టర్‌ రాజేంద్రనాథ్‌

Covid 19: King Koti Hospital Superintendent Clarify People Doubts On Phone - Sakshi

సూపరింటెండెంట్‌ రాజేంద్రనాథ్‌

గంట వ్యవధిలో 179 మంది సందేహాలు నివృత్తి

భరోసానిచ్చేలా.. ప్రతి ప్రశ్నకు సమాధానం

హిమాయత్‌నగర్‌: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆస్పత్రికి రావాలంటే గజగజ వణుకుతున్నారు. వైద్యులు కూడా ఇంటి వద్దనే ఐసోలేషన్‌లో ఉండి పలు జాగ్రత్తలు తీసుకోమంటున్నారు. ఈ నేపథ్యంలో ‘కరోనాను జయిద్దాం’ అనే కాన్సెప్‌్టతో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌ కార్యక్రమాన్ని కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్‌తో సోమవారం నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాలకు చెందిన పలువురు ఫోన్స్‌ చేసి డాక్టర్‌ రాజేంద్రనా«థ్‌ నుంచి అనేక సలహాలు, సూచనలను తీసుకున్నారు. ‘సాక్షి’ నిర్వహించిన ఈ ‘ఫోన్‌ఇన్‌’కు ప్రజల నుంచి విశేష స్పందన వచి్చంది. సుమారు 179 మంది వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు చేయడం విశేషం. 

పాఠకుల ప్రశ్నలు, డాక్టర్‌ రాజేంద్రనాథ్‌ సమాధానాలు ఇలా.. 
ప్రశ్న: ప్రతిరోజూ రాత్రి సమయంలో జ్వరం వస్తుంది. డోలో వేస్తున్నా తగ్గట్లేదు ఏం చేయాలి? 
– ఉదయ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
జవాబు: పారాసెటమాల్‌ ట్యాబ్లెట్‌ను వరుసగా రెండు రోజులు వాడండి. రెండు రోజులు వాడినా తగ్గకుండా జ్వరం అలాగే ఉన్నా.. వచ్చి పోతున్నా.. తక్షణమే మీ దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి కోవిడ్‌ టెస్ట్‌ తప్పకుండా చేయించుకోండి. 
ప్రశ్న: కాళ్లు నొప్పులు బాగా వస్తున్నాయి డాక్టర్‌ గారు. నాకు కరోనా ఏమైనా వచ్చిందంటారా? 
– సాయిరాం, హిమాయత్‌నగర్‌ 
జవాబు: పారాసెటమాల్‌ లేదా డోలో ట్యాబ్లెట్స్‌ రెండు లేదా మూడు రోజులు వాడండి. అప్పటికీ తగ్గకుండా ఆయాసం లాంటిది వస్తే వెళ్లి టెస్ట్‌ చేయించుకోండి. 
ప్రశ్న: రెండ్రోజులుగా చల్లనీళ్లు తాగుతున్నా. గొంతు బాగా ఎండిపోతుంది. నాకు కరోనా ఏమైనా వచి్చనట్టా? 
– అమీన్, హిమాయత్‌నగర్‌ 
జవాబు: భయపడాల్సిన అవససరం ఏమీ లేదు. మీరు రెండ్రోజుల పాటు క్రమం తప్పకుండా డాక్సీసైక్లిన్‌ ట్యాబ్లెట్స్‌ను వాడండి. అలాగే కొద్దిగా ఈ టైంలో చల్లని నీటిని తగ్గించండి. 
ప్రశ్న: డాక్టర్‌ గారూ ఒకసారి తడి దగ్గు కొద్దిసేపు అయ్యాక పొడి దగ్గు వస్తుందండి. దగ్గు రాకుండా ఉండేందుకు సిరప్‌ తాగుతున్నాను. 
– రమా, నారాయణగూడ 
జవాబు: చల్లటి నీరు తాగడం మానేయండి. డాక్సీసైక్లిన్‌ 100 ఎంఎమ్‌జీ ట్యాబ్లెట్‌ వాడండి. మూడు రోజులుగా ఇలాగే ఉండి తగ్గకపోతే వెంటనే కోవిడ్‌ ర్యాపిడ్‌ లేదా ఆరీ్టపీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోండి. 
ప్రశ్న: ప్రతిరోజూ రాత్రి జ్వరం వస్తుంది. ఉదయం తగ్గిపోతుంది. 
– చంద్రకళ, హిమాయత్‌నగర్‌ 
జవాబు: ఆందోళన ఏమీ వద్దు. డోలో 650 ట్యాబ్లెట్‌ అయితే రెండు పూటలా వేసుకోండి. పారాసెటమాల్‌ ట్యాబ్లెట్‌ అయితే మూడు పూటలా వేసుకోండి. తగ్గకపోతే ఖచి్చతంగా వెళ్లి కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోండి. నిర్లక్ష్యం వద్దు ఇలా జ్వరం తరచూ వస్తుంటే.  
ప్రశ్న: రెండ్రోజులుగా నీళ్ల విరేచనాలు అవుతున్నాయి. కాస్త భయంగా ఉంది డాక్టర్‌ గారు. 
– సర్ఫరాజ్, దత్తానగర్‌ 
జవాబు: ఎక్కువగా అవుతుంటే దగ్గర్లోని డాక్టర్‌ని సంప్రదించండి. విరేచనాలతో పాటు జ్వరం కూడా వస్తే వెంటనే కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోండి. డాక్సీసైక్లిన్‌ ట్యాబ్లెట్‌ను కూడా వాడొచ్చు. 
ప్రశ్న: కొద్దిరోజులుగా తుమ్ములు ఎక్కువగా వస్తున్నాయి. నాకు సహజంగానే డస్ట్‌ ఎలర్జీ ఉంది. వ్యాక్సిన్‌ వేసుకోవచ్చా? 
– నీలిమా, పంజగుట్ట 
జవాబు: డస్ట్‌ ఎలర్జీ ఉన్నంత మాత్రాన వ్యాక్సిన్‌కు భయపడక్కర్లేదు. ధైర్యంగా మీరు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు. మీరు మొదటి డోస్‌ వేసుకున్నాక ఎలర్జీ రాలేదు కాబట్టి రెండో డోస్‌ టైం రాగానే టీకా వేసుకోండి. 
ప్రశ్న: వ్యాక్సిన్‌ వేసుకున్నాక కూడా పాజిటివ్‌ ఏమైనా వస్తుందా? 
– భారాతి, ముషీరాబాద్‌ 
జవాబు: వ్యాక్సిన్‌ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటే వ్యాక్సిన్‌ వేసుకున్నా వేసుకోకపోయినా కోవిడ్‌ వచ్చే అవకాశం ఉంది. 
ప్రశ్న: ఉదయమే వేడి నీళ్లల్లో పసుపు వేసుకుని తాగొచ్చా డాక్టర్‌? 
– రమా, బాగ్‌ అంబర్‌పేట 
జవాబు: హా.. నిశ్చంతంగా తాగొచ్చు. నీళ్లు కాగుతున్న సమయంలోనే చిటికెడు పసుపు వేయండి. కాస్త చల్లారినాక వాటిని తాగితే ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఎట్టి పరిస్థితుల్లో షుగర్‌ వేయొద్దు. 
ప్రశ్న: కోవిడ్‌ వచ్చినా.. రాకున్నా.. ఇంట్లో ఉండి ఏ విధమైన ఆహారం తీసుకోవచ్చు? 
– ప్రతిమరెడ్డి, లక్డీకాపూల్‌ 
జవాబు: ఇంట్లో ఉండి చక్కగా ఉదయం రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఒక గ్లాస్‌ పాలు తీసుకోండి. దానితో పాటు మాంసాహారం కూడా తినొచ్చు. జీడిపప్పు, బాదం పప్పు కూడా తినండి ప్రొటీన్‌ శాతం పెరుగుతుంది. 
ప్రశ్న: వాంతులు, విరేచనాలు తగ్గడానికి ఏదైనా సలహా ఇవ్వండి డాక్టర్‌ గారు. 
– వైషాలి రెడ్డి, జూబ్లీహిల్స్‌ 
జవాబు: ఉడకబెట్టిన కందిపప్పు నీళ్లు తాగండి. అన్నం వంచే సమయంలో గంజి పట్టుకుని దానిని తాగండి. ఈ రెండింటితో పాటు సగ్గుబియ్యం కూ డా తాగండి. విరేచనాలు, వాంతులు తగ్గిపోతాయి. కంటిన్యూగా అవుతుంటే వెళ్లి కరో నా టెస్ట్‌ చేయించుకోండి. 
(చదవండి: అనగనగా అపార్ట్‌మెంట్‌: కలిసికట్టుగా.. కోవిడ్‌ కేర్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-05-2021
May 11, 2021, 15:09 IST
మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ ఉందని, సమావేశం అనంతరం లాక్‌డౌన్‌, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు.
11-05-2021
May 11, 2021, 13:58 IST
జెనీవా: భారత్‌లో బయటపడిన కరోనా వైరస్‌ బి-1617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళనకరమైన స్ట్రెయిన్‌గా వర్గీకరించింది. ఇండియన్‌ స్ట్రెయిన్‌పై...
11-05-2021
May 11, 2021, 13:26 IST
పట్నా: ‘‘వైద్యో నారాయణో హరిః’’ అన్నారు. ఓ వైపు కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మరో వైపు డాక్టర్లు తమ...
11-05-2021
May 11, 2021, 13:21 IST
ఢిల్లీ: ప్రముఖ కరోనా వ్యాక్సిన్‌ తయారీదారు భారత్‌ బయోటెక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొవాక్జిన్‌ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపిణీకి...
11-05-2021
May 11, 2021, 13:12 IST
యశవంతపుర: కరోనాతో మృతి చెందిన అమ్మ మృతదేహాన్ని కొడుకు ఆటోలో సొంతూరికి తీసుకెళ్లాడు. మండ్య జిల్లా వళవళ్లికి చెందిన శారదమ్మ...
11-05-2021
May 11, 2021, 13:04 IST
రోమ్‌: ప్రపంచంలో ఎక్కడ చూసిన కరోనా ప్రభావమే కనిపిస్తోంది.  మహమ్మారి అడుగు పెట్టిన ప్రతి చోటా అల్లకల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్‌కు...
11-05-2021
May 11, 2021, 12:24 IST
మీకు తెలుసా.. నాకు ఇద్దరు అమ్మలు అనే గర్వం నాలో ఉండేది. కానీ.. ఏ మనిషికీ ఇంత గర్వం పనికిరాదు. ...
11-05-2021
May 11, 2021, 11:49 IST
దొడ్డబళ్లాపురం: కరోనా రక్కసి అనుబంధాలను విచ్ఛిన్నం చేస్తోంది. దొడ్డ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్‌ కుటుంబం మొత్తం...
11-05-2021
May 11, 2021, 11:44 IST
చిత్తూరుకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా సోకడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో)లో చేరాడు. వారం తర్వాత మెరుగైన...
11-05-2021
May 11, 2021, 11:25 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. తాజాగా...
11-05-2021
May 11, 2021, 10:23 IST
సాక్షి, బెంగళూరు: కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఆంక్షలను అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో...
11-05-2021
May 11, 2021, 09:45 IST
ఒంగోలు టౌన్‌: కరోనా బారిన పడినవారు మానసిక ఒత్తిడికి గురికాకూడదు. అదే సమయంలో అధిక పోషక విలువలు కలిగిన ఆహారం...
11-05-2021
May 11, 2021, 09:33 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు ధరించడం కచ్చితం. ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వైరస్‌ నుంచి...
11-05-2021
May 11, 2021, 08:51 IST
వాషింగ్టన్‌: భారత్‌లో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. ఆక్సిజన్‌ కొరతతో రోజు...
11-05-2021
May 11, 2021, 08:33 IST
సాక్షి, హిమాయత్‌నగర్‌: ఆక్సిజన్‌ అందక కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో ఎవరూ మరణించలేదని వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌ పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఆదివారం...
11-05-2021
May 11, 2021, 08:08 IST
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను తెలంగాణలోకి అనుమతించడంలేదు.
11-05-2021
May 11, 2021, 05:52 IST
న్యూఢిల్లీ: కరోనా టీకా పొందాలంటే కోవిన్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో పేర్లు, వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అయితే,...
11-05-2021
May 11, 2021, 05:10 IST
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వలంటీర్లకు బయో మెట్రిక్‌ హాజరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం...
11-05-2021
May 11, 2021, 05:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష ఎన్నికలు వాయిదాపడ్డాయి. దేశంలో కోవిడ్‌ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్ష...
11-05-2021
May 11, 2021, 04:56 IST
ముంబై: చేసిన సాయం చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదని ప్రఖ్యాత బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌(78) స్పష్టం చేశారు. దేశమంతటా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top