Covid 19: డెల్టా, గామా, ల్యామ్డా, డెల్టా ప్లస్‌.. మాస్కు ధరించకపోతే అంతే!

Covid 19 Cases Rise Worries Everybody Should Wear Face Mask Photos - Sakshi

ఆల్ఫా, బీటా, డెల్టా, గామా, కప్పా, ల్యామ్డా, డెల్టా ప్లస్‌... ఇలా మహమ్మారి కరోనా అనేక రూపాలు మార్చుకుంటూ మానవాళిని వణికిస్తోంది. కోవిడ్‌ నిరోధక వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో అందుబాటులో లేకపోవడం, మరోవైపు థర్డ్‌వేవ్‌ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ మనల్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా భౌతికదూరం పాటించడంతో పాటు మాస్కు ధరించడం తప్పనిసరి. 

కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మినపుడు లేదా దగ్గినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరలు మనపై పడకుండా మాస్కు అడ్డుకుంటుంది. అంతేకాదు గాలిలోని అనేకానేక సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించకుండా ఆపేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా సర్జికల్‌, రిస్సిరేటర్‌, క్లాత్‌ ఫేస్‌ కవరింగ్‌ అనే మూడు రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. 

ఆపరేషన్‌ థియేటర్‌లో సర్జరీ సమయంలో పేషెంట్లకు ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా సర్జికల్‌ మాస్కులు వాడతారు.

గాలిని శుద్ధి చేసే రిస్పిరేటర్లను కూడా రోగుల కోసం ఉపయోగిస్తారు.

అయితే, ‍కరోనా కాలంలో సామాన్య ప్రజలు కూడా సర్జికల్‌ మాస్కులను ఉపయోగిస్తున్నారు.

ఇక ఇంట్లో అందుబాటులో ఉన్న వస్త్రాలతో చాలా మంది క్లాత్‌ మాస్కులు తయారు చేసుకుంటున్నారు. 

చాలా మంది ఫేస్‌మాస్కుతో పాటు కళ్ల నుంచి వైరస్‌ లోపలికి ప్రవేశించే వీల్లేకుండా గాగుల్స్‌ ధరిస్తున్నారు కూడా.

ఏదైమైనా కరోనా కాలంలో చికిత్స కంటే నివారణే మేలు అన్న చందంగా వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించండి. సామాజిక దూరం పాటించండి. శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. తప్పక వ్యాక్సిన్‌ వేయించుకోండి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top