తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు.. సర్కార్‌ అప్రమత్తం | Covid 19 Cases Rise In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు.. సర్కార్‌ అప్రమత్తం

Jun 3 2025 5:10 PM | Updated on Jun 3 2025 5:58 PM

Covid 19 Cases Rise In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం నాలుగు యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదవ్వగా..  రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది. సాక్షి మీడియాతో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో కోవిడ్ నియంత్రణలో ఉందని కోవిడ్ పాండమిక్ స్టేజ్ నుంచి ఎండ్‌మిక్ స్టేజ్‌కి వచ్చిందన్నారు.

 ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోవిడ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కాదని ప్రకటించింది. ఇప్పుడు వైరస్ ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే చాలా మైల్డ్ లక్షణాలు ఉంటాయి. సాధారణంగా కొన్ని జాగ్రత్తలు ప్రజలు పాటించాల్సిందే. వృద్ధులు, కోమోర్బిడిటీస్ ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి.. వేరియంట్ అనేది కాలంతో పాటు మారుతూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది ముఖ్యం. ఇప్పుడు మైల్డ్ లక్షణాలు ఉంటున్నాయి’’ అని రవీందర్‌ నాయక్‌ వివరించారు.

ప్రజలు పానిక్ కావొద్దు. అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలకు మార్గదర్శకాలు, సూచనలు పంపిస్తున్నాం, కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం. మన దగ్గర పరిస్థితి కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని రవీందర్‌ నాయక్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement