
కారుణ్య నియామకం కింద కానిస్టేబుల్ కుమార్తెకు జూనియర్ అసిస్టెంట్ కొలువు
నియామక పత్రాన్ని అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఓ కుటుంబం కల ఫలించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆ కుటుంబంలోని మహిళకు నియామక పత్రాన్ని అందించారు. హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఆ మహిళకు ఉత్తర్వులను అందించి ఆ కుటుంబంలో సంతోషం నింపారు. వరంగల్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి.భీమ్‌సింగ్ సర్వీస్‌లో ఉండగా సెప్టెంబర్, 1996లో మర ణించారు.
తండ్రి మరణంతో కారుణ్య నియామ కం కోసం ఆయన కూతురు బి.రాజశ్రీ దరఖాస్తు చేసుకున్నారు. కానీ వివిధ కారణాలు చూపుతూ అధికారులు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరా కరించారు. రాజశ్రీ అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రాజశ్రీ సమస్యను తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగ రాజు.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
మానవతా దృక్పథంతో స్పందించిన రేవంత్ రెడ్డి నిబంధనలు సడలించైనా సరే ఉద్యోగం ఇవ్వాలని సీఎంవో అధికారులకు సూచించారు. దీంతో హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. రాజశ్రీ తన కుటుంబంతో కలిసి వచ్చి సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.