పీవీకి కాంగ్రెస్‌ ఘన నివాళి

Congress Party Leaders Pays Tributes To Former Pm PV Narasimha Rao - Sakshi

ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించిన దిగ్విజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ పర్యట నలో ఉన్న పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ శుక్రవారం ఉదయం నెక్లె స్‌రోడ్డులోని పీవీ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు.

గాంధీభవన్‌లో కూడా కాంగ్రెస్‌ పార్టీ నేతలు పీవీకి నివాళులర్పించారు. టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్‌రావు, జనక్‌ ప్రసాద్, మెట్టు సాయికుమార్, పాల్వాయి స్రవంతి, కె.ఎస్‌.ఆనందరావు తదితరులు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top