హైదరాబాద్: రాబోయే కాలంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి హెచ్చరించారు. వందకు పైగా దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. ఈ ఎల్‌నినో ప్రభావంతో కరువు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఆరు నెలలుగా కరువుపై ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నామని, వచ్చే జూలై వరకూ ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్నారు సీఎం రేవంత్. సాగుకు నీరిచ్చే అవకాశం కాదు.. తాగునీరుకే కష్టాలు చూడాల్సిన పరిస్థితులు రావొచ్చన్నారు.
ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 23వ తేదీ) ప్రజాభవన్‌లో ఎల్‌నినో ప్రభావంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘కరువు, భూకంపాలు, వరదలు, ఇవన్నీ ప్రకృతి విపత్తులే. జాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతి విపత్తుల నుంచి బయటపడొచ్చు. ఆరు నెలలుగా కరువుపై ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. . జూలై వరకూ ఎల్‌నినో ప్రభావం ఉంటుంది. సాగునీరు దేవుడెరుగు.. తాగునీటికి కూడా కష్టమవుతుంది. జనాలు ఇళ్ల నుంచి బయటకు కూడా రాని పరిస్థితి వస్తుంది. ప్రజల్ని భాగస్వామ్యం చేయకుండా కరువును ఎదుర్కోలేం. మానవత్వాన్ని కూడగట్టుకుని ముందుకు సాగాలి
‘మనం అంటే గిట్టని వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కావాలని బురద చల్లుతున్నారు. మామ అల్లుళ్లు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. కరోనా ఉత్తదే అని కేసీఆర్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ కరువు అనడం అన్యాయం. ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తోంది. మహారాష్ట్రలో తాగే నీరు కూడా రేషన్లో ఇస్తున్నారు. తాగు నీరుకు తీవ్ర కష్టాలు రానున్నాయి. ఎండ కాలంలో ఊహించని పరిస్థితులు వస్తాయి. ముందస్తు ప్రణాళిక లేకపోతే ఇబ్బంది వస్తుంది. ప్రజలకు అవగాహన కల్పించాలి’ అని రేవంత్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో ‘డిండి’ చీలిక!


