ప్రాచీన నాగరికతల ఆనవాళ్ల గుర్తింపులో కీలకపాత్ర పోషిస్తున్న ఏఐ
శతాబ్దాల నాటి రహస్యాల ఛేదనకు ఆధునిక సాంకేతికత వినియోగం
తవ్వకాలు, శాసనాల విశ్లేషణలో పరిశోధకులకు సహాయం
పురావస్తు పరిశోధనల్లో కొత్త అధ్యాయం మొదలైంది. గతంలో గుర్తించలేని వస్తువులు, నిర్మాణాల ఆనవాళ్లను వెలికితీయడం.. శతాబ్దాలుగా పరిష్కారంకాని చారిత్రక రహస్యాలను ఛేదించడంలో కృత్రిమ మేధ (ఏఐ) కీలకంగా మారుతోంది. నెపోలియన్ బోనపార్ట్ కాలానికి చెందిన 217 ఏళ్ల నాటి లేఖలోని సైనిక సంకేతాన్ని విశ్లేషించేందుకు పరిశోధకులు ఇటీవల ఏఐ సాయం కోరగా ఆ లేఖలోని సుమారు 1,300 చిహా్నలను విశ్లేషించిన ఏఐ మోడల్.. వాటి మధ్య సంబంధాలను కేవలం
ఆరు గంటల్లోనే గుర్తించింది. సంప్రదాయ పద్ధతుల్లో దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యను ఛేదించడంలో ఈ సాంకేతికత ఉపయోగపడింది.
నాజ్కా ఎడారిలో కొత్త ఆకృతుల గుర్తింపు
పెరూలోని నాజ్కా ఎడారిలో భూమిపై చెక్కిన భారీ ఆకృతులను గుర్తించడంలోనూ ఏఐ తన సామర్థ్యాన్ని చాటుతోంది. వైమానిక చిత్రాలను విశ్లేషించే డీప్ లెరి్నంగ్ వ్యవస్థలు గతంలో గుర్తించని ఆకృతుల ఆనవాళ్లను వెలికితీస్తున్నాయి. ఆరు నెలల సర్వేలో సుమారు 303 సంభావ్య ఆకృతులను గుర్తించేందుకు ఏఐ తోడ్పడింది. మానవులు, జంతువులు, పక్షుల రూపాలను పోలిన ఈ ఆకృతులు ప్రాచీన సమాజాల జీవన విధానంపై కొత్త ఆధారాలను అందించే అవకాశం ఉంది. భూమి ఉపరితలాన్ని కాంతి తరంగాల సాయంతో కొలిచే లైడార్ సాంకేతికత పురావస్తు పరిశోధనకు మరో కీలక సాధనంగా మారుతోంది. దట్టమైన అడవులు, వృక్షసంపద కప్పేసిన ప్రాంతాల్లోనూ భూమి ఆకృతులను విశ్లేషించి పురాతన నిర్మాణాల ఆనవాళ్లను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతోంది.
సింధు లిపి రహస్యాల ఛేదనకు ప్రయత్నాలు
సుమారు 5 వేల ఏళ్ల నాటి సింధు నాగరికత లిపిని అర్థం చేసుకోవడానికి కూడా ఏఐ ఆధారిత గణన పద్ధతులను వినియోగిస్తున్నారు. చిహ్నాల క్రమం, పునరావృతాలను విశ్లేíÙస్తూ వాటి మధ్య సంబంధాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిహా్నలను గుర్తించడం, వర్గీకరించడంలో ఏఐ ఉపయోగపడుతున్నప్పటికీ వాటి వెనుక ఉన్న భాషను పూర్తిగా అర్థం చేసుకోవడం ఇప్పటికీ సవాలుగానే ఉంది. ఈజిప్టు హైరోగ్లిఫ్స్, ప్రాచీన గ్రీకు శాసనాలు సహా వివిధ నాగరికతలకు చెందిన చారిత్రక ఆధారాల అధ్యయనంలోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. వేలాది చిత్రాలు, శాసనాలను వేగంగా పరిశీలించడం, అక్షరాలను వేరు చేయడం, ఒకే తరహా నమూనాలను గుర్తించడం వంటి పనుల్లో ఇది పరిశోధకులకు సహాయపడుతోంది.
మానవ నైపుణ్యానికి ప్రత్యామ్నాయం కాదు
ఏఐ పరిశోధన వేగాన్ని పెంచుతున్నప్పటికీ అది పురావస్తు నిపుణుల అవసరాన్ని పూర్తిగా తొలగించలేదు. గుర్తించిన ఆనవాళ్లకు చారిత్రక ప్రాధాన్యం ఏమిటి? అవి ఏ కాలానికి చెందినవి? వాటి వెనుక ఉన్న సాంస్కృతిక నేపథ్యం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో మానవ పరిశీలనే కీలకం. ఏఐ అందించే ఫలితాలను నిపుణులు ధ్రువీకరించాల్సిందే. అదే సమయంలో ప్రాచీన నాగరికతల ఆనవాళ్ల అన్వేషణలో ఏఐ కొత్త డిటెక్టివ్‌గా అవతరిస్తోంది. మానవ కంటికి చిక్కని ఆధారాలను గుర్తించడం నుంచి, చరిత్రలోని అంతుచిక్కని రహస్యాలపై కొత్త వెలుగులు ప్రసరించడం వరకు ఈ సాంకేతికత పురావస్తు పరిశోధనకు కొత్త అవకాశాలను తెరుస్తోంది.
– సాక్షి, సెంట్రల్ డెస్క్


