CM KCR Will Visit Kondagattu On February 14th - Sakshi
Sakshi News home page

ఈనెల 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్‌!

Feb 11 2023 9:05 PM | Updated on Feb 11 2023 9:24 PM

CM KCR ist Kondagattu On February 14th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 14న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యాదాద్రి ఆలయ ఆర్కిటెక్చర్‌ ఆనంద్‌ సాయి ఆదివారం కొండగట్టుకు వెళ్లనున్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించిననున్నారు ఆనంద్‌ సాయి. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్‌, భద్రతా ఏర్పాట్లను జగిత్యాల ఎస్పీ భాస్కర్‌ పరిశీలించారు.

కాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దేవాలయ అభివృద్ధికోసం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్‌) కింద ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె, రామకృష్ణా రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.  అయితే ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు విడుదల చేస్తామని గత డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇవ్వగా.. ఈ మేరకు నిధులు విడుదల చేశారు.
చదవండి: ఢిల్లీ లిక్కర్‌ కేసు: మరోసారి తెరమీదకు ఎమ్మెల్సీ కవిత పేరు

Advertisement
 
Advertisement
Advertisement