రామప్పకు యునెస్కో గుర్తింపుపై సీఎం కేసీఆర్ హర్షం

CM KCR Happy About Ramappa Temple Getting Unesco Recognition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపుపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాకతీయ రాజులు రామప్ప ఆలయాన్ని అత్యంత సృజనాత్మకంగా కట్టారన్నారు. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది: కేటీఆర్‌
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప ఆలయం అని తెలిపారు. యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించిన వారిందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top