
చినజీయర్ స్వామిని తోడ్కొని వస్తున్న ఎమ్మెల్యే మాధవరం
కూకట్‌పల్లి: నగరంలోని కూకట్‌పల్లిలో ఉన్న 436 ఏళ్ల నాటి శ్రీ సీతా రామ చంద్రస్వామి దేవాలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమం సోమ వారం త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆలయానికి విచ్చేసిన చినజీయర్ స్వామికి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు, ఆలయ అధికారులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. గర్భగుడిలో యంత్ర ప్రతిష్టాపన తరువాత వెండి ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. యాగశాలలో పూర్ణాహుతి, మూల విరాట్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.