హైదరాబాద్‌లో మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు..?

Chances To Introduce Double Decker Buses Again  In Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిజాం కాలంలో భాగ్యనగరంలో ‍డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఉండేవి. అయితే కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి. తాజాగా షాకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేయడంతో వాటిపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకప్పుడు జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జ‌ల్‌గంజ్‌, అబిడ్స్‌, హుస్సేన్ సాగ‌ర్‌, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌ వరకు బస్సులు తిరిగేవని, ఇప్పుడు మళ్లీ అలాంటి డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్ర‌యాణికులు లేదా టూరిస్టుల కోసం తీసుకురావాల‌ని  కేటీఆర్ను కోరుతూ ట్వీట్‌ చేశారు. 

దీనిపై స్పందించిన కేటీఆర్‌.. తాను అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామ‌ర్ స్కూల్లో తాను చ‌దువుకునే రోజుల్లో ఆ దారిగుండా వెళ్తున్న‌ప్పుడు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు క‌నిపించేవని, వాటి జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని తెలిపారు.  అయితే ఆ బస్సులను ఎందుకు పూర్తిగా ఆపేశారో తనకు తెలియదని, మళ్లీ హైదారాబాద్‌ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులను తీసుకొచ్చే అవకాశం​ ఏమైనా ఉందా అని రవాణా ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌ను కేటీఆర్ అడిగారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా కేటీఆర్‌ సూచించారు. 
 

విజయవంతంగా ఎలక్ర్టిక్‌ బస్‌ ట్రయల్స్‌
తిరుమలలో రెండవరోజు నిర్వహించిన  ఎలక్ర్టిక్‌ బస్‌ ట్రయల్‌ రన్‌  విజయవంతంగా సాగింది. మొత్తం మూడు రోజులపాటు ఈ ట్రయల్‌ రన్‌ కొనసాగనుంది. తిరుమల పవిత్రత, కాలుష్య నివారణలో భాగంగా తిరుపతి నుంచి తిరుమల వరకు ఈ బస్సులను నడపాలని టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ అధికారులు ఎలక్ర్టిక్‌ బస్‌ ట్రయల్‌ రన్‌ను నిర్వహించారు.  మూడవ రోజు కూడా ట్రయల్స్‌ నిర్వహించి దీనిపై త్వరలోనే  నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలక్ట్రికల్‌ బస్‌ ట్రయల్స్‌లో డ్రైవర్ల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నట్టు  ఏపియస్ ఆర్టీసి అధికారులు పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top