సీసీఎంబీ శాస్త్రవేత్తకు ఇన్ఫోసిస్ అవార్డు

సాక్షి ,హైదరాబాద్: శాస్త్ర, పరిశోధన రంగాల్లో చేసిన కృషికి గాను దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ అందించే ఇన్ఫోసిస్ సైన్స్ అవార్డు ఈ ఏడాది హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్త డాక్టర్ రాజన్ శంకరనారాయణన్ ను వరించింది. జీవశాస్త్ర రంగానికి సంబంధించి డాక్టర్ రాజన్ కు అవార్డు దక్కగా ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో హరి బాలక్రిష్ణన్‌ను అవార్డుకు ఎంపిక చేసినట్ల ఇన్ఫోసిస్ తెలిపింది. దేశంలో ప్రతీ పేద బాలుడికీ పోషకాహారం, విద్య, ఆరోగ్య సౌకర్యాలు, గూడు అందుబాటులో ఉండాలని ఇన్ఫోసిస్ ఆశిస్తోందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకల్లో ఒకరైన నారాయణ మూర్తి తెలిపారు. శాస్త్రవేత్తలకు అవార్డులు ఇవ్వడం ద్వారా తాము ఆ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి