చైతన్య భారతీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT)లో కొత్తగా చేరిన పీజీ విద్యార్థుల కోసం ఓరియెంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అకాడమిక్ అండ్ ఎగ్జామినేషన్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. వీ. నరసింహులు స్వాగత ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీబీఐటీ పరిపాలనా బృందం డిప్యూటీ ప్రిన్సిపాల్‌లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు, లైబ్రేరియన్, ఇతర అధికారులు, విద్యార్థులకు పరిచయం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ రవి కుమార్ మెదురి (ఇన్నోమైండ్స్) కృత్రిమ మేధస్సు రంగంలో అవకాశాలపై ప్రేరణాత్మక ఉపన్యాసం ఇచ్చారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఎం.ఎల్.నరసింహన్ (ఎవెర్ నార్త్ హెల్త్ సర్వీసెస్) నిరంతర అభ్యాసం, స్వీయ అభివృద్ధి ప్రాధాన్యతను వివరించారు.
విద్యార్థుల ప్రగతికి మార్గదర్శకంగా సీబీఐటీ అకాడమిక్ ప్రొఫెసర్ పి.వి.ఆర్. రవీంద్ర రెడ్డి, కె. కృష్ణవేణి, సురేశ్ పబ్బోజు, పి.ప్రభాకర్ రెడ్డి, బి. లింగ రెడ్డి, డా. ఎన్.ఎల్.ఎన్.రెడ్డి తమ సూచనలు అందించారు. కార్యక్రమాన్ని డా. రాహుల్, డా.బి.లావణ్య,పీ. కృష్ణ ప్రసాద్ సమన్వయం చేశారు. ముఖ్య అతిథులకు స్మారక చిహ్నాల ప్రదానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వోటు ఆఫ్ థ్యాంక్స్‌తో కార్యక్రమం ముగిసింది.


