ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య రాళ్లదాడి

BRS And Congress Leaders Stones Hurled At Ibrahimpatnam - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి గురువారం నామినేషన్‌ వేసేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నియోజకవర్గంలో ఒకేసారి రెండు పార్టీలు భారీ ర్యాలీ చేపట్టాయి.

ర్యాలీగా వెళుతున్న సమయంలో ఇరు పార్టీలు ఎదురుపడగా.. కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ జెండాలను కాంగ్రెస్ నేతలపై, కాంగ్రెస్ పార్టీ జెండాలను బీఆర్‌ఎస్ నేతలపై విసురుకున్నారు. ఈ ఘటనలో పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీ నేతలపై లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపుచేసేందుకు యత్నించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top