భువనగిరి ప్రజా ఆశీర్వాద సభలో అపశ్రుతి.. గుండెపోటుతో కార్యకర్త మృతి

BRS Activist died Due To heart Attack In Yadadri Meeting - Sakshi

సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో అపశ్రుతి నెలకొంది. సభకు హాజరైన కార్యకర్తకు గుండెపోటు రావడంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్లు ప్రకటించారు. మృతుడిని పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన సత్తయ్యగా గుర్తించారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎన్నికల ప్రచారానికి  భువనగిరి వేదిక సిద్ధమైంది. కాసేపట్లో భువనగిరి ప్రభుత్వ కాలేజీ ఆవరణలో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌‌‌‌  హాజరు కానున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైలా శేఖర్‌ రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం బీఆర్‌ఎస్‌ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.ఇప్పటికే సభా స్థలికి వేలాది మంది కార్యకర్తలు చేరుకున్నారు. పాటలు, నృత్యాలతో కళాకారులు హోరెత్తిస్తున్నారు.
చదవండి: అప్పట్లో జనగామను చూసి ఏడ్చా : ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top