Bonalu: పాతబస్తీకి పండగొచ్చింది | Bonalu : Big Celebrations At Lal Darwaza Hyderabad | Sakshi
Sakshi News home page

Bonalu: పాతబస్తీకి పండగొచ్చింది

Jul 28 2024 7:48 AM | Updated on Jul 28 2024 11:31 AM

Bonalu : Big Celebrations At Lal Darwaza Hyderabad

నేడు వైభవంగా లాల్‌దర్వాజా బోనాలు   

 అమ్మవారి ఉత్సవాలకు సర్వం సిద్ధం   

 పట్టువ్రస్తాలు సమరి్పంచనున్న మంత్రులు  

చార్మినార్‌/చాంద్రాయణగుట్ట: పాతబస్తీకి ఉత్సవ కళ వచ్చింది. బోనాల పండగతో ఉత్సాహం ఉట్టిపడుతోంది. ఆషాఢమాసం బోనాల జాతరలో భాగంగా ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమరి్పంచనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.  

బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం, మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారి దేవాలయం సహా అన్ని ప్రధాన ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమరి్పంచి పూజలు చేస్తారని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్‌ గాజుల అంజయ్య తెలిపారు. 

 

భక్తులకు వసతులు కల్పించాలి: ఆమ్రపాలి  
లక్డీకాపూల్‌:   బోనాల ఉత్సవాల్లో  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. 

నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఆదివారం జరగనున్న బోనాల ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో గ్రేటర్‌లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.  

నేడు, రేపు మద్యం దుకాణాలు బంద్‌ 
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆది, సోమవారాల్లో మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ మంగళవారం వైన్స్‌ యథావిధిగా తిరిగి తెరుచుకుంటాయని పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement