దేశ రాజకీయాల పేరిట కేసీఆర్‌ కొత్త డ్రామాలు: బండి సంజయ్‌

BJP President Bandi Sanjay Criticizes Telangana CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దాడులు, ఉద్యోగ నోటి ఫికేషన్ల విడుదలలో జాప్యం వంటి విషయా లపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం కేసీఆర్‌ దేశరాజకీయాలు, ఫ్రీ కరెంటు అంటూ కొత్త డ్రామాకు తెరదీశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమె త్తారు. ఇబ్రహీంపట్నం ఘటనలో వైద్యశాఖ మంత్రి హరీశ్‌ను బర్తరఫ్‌ చేయాలని, వైద్య శాఖ డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లా డుతూ.. దేశంలో ఎక్కడ ఈడీ దాడులు జరి గినా, అవినీతి, అక్రమాలు బయటపడ్డా కేసీఆర్‌ కుటుంబసభ్యుల ప్రమేయం ఉన్నట్లు వార్తలొస్తున్నాయన్నారు. ఈ చర్చను, ప్రజా సమస్యలను, రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలను దారి మళ్లించేందుకే కేసీఆర్‌ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డా రు. ‘ఇబ్రహీంపట్నం ఘటనౖపై దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు, దీనికి బాధ్యుడైన హెల్త్‌ డైరెక్టర్‌ను విచారణ అధికారిగా నియమిస్తా రా? ఆయనపై ఉన్నన్ని ఆరోపణలు ఎవరి పైనా లేవు. పోస్టింగులు, డిప్యూటేషన్లు, ప్రమోషన్లుసహా ఏ పని చేసినా ఆయనకు పైసలియ్యాల్సిందే. నెలనెలా మూటముల్లె సీఎం, మంత్రికి అప్పగిస్తుండు. రేపోమాపో కేసీఆర్‌ ఆయనను ఎమ్మెల్సీ చేస్తాడేమో’ అని వ్యాఖ్యానించారు. ఈడీ దాడులపై విలేకరుల ప్రశ్నలకు సంజయ్‌ స్పందిస్తూ వాళ్ల పనివాళ్లు చేస్తరని, దాని గురించి తమకు సమాచారం లేదని అన్నారు.

కేసీఆర్‌ మోసాలు చాటాలి
‘టీఆర్‌ఎస్‌ను గద్దె దించేది, బీజేపీని అధికారంలోకి తెచ్చేది మునుగోడు ఉప ఎన్నికే. ఈ నియోజకవర్గంలో ఒక్కో ఎస్సీ మోర్చా కార్యకర్త సగటున వంద ఇళ్లకు వెళ్లి టీఆర్‌ఎస్‌ మోసాలను ఎండగట్టండి. దళితులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు  చేసిన అన్యాయాలను వివరించండి’ అని  బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. మంగళ వారం ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జి.వివేక్‌ వెంకటస్వామి, మునుస్వామి, కొప్పు భాషా, కుమ్మరి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇదీ చదవండి: అమిత్‌ షా యాక్షన్‌ప్లాన్‌.. ఢిల్లీలో మెగా మీటింగ్‌.. ఇంక ఆ సీట్లపైనే గురి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top