ఉద్యోగం ఎర వేస్తారు...క్లిక్‌ చేస్తే ఊడ్చేస్తారు | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఎర వేస్తారు...క్లిక్‌ చేస్తే ఊడ్చేస్తారు

Published Wed, Dec 20 2023 3:23 AM

Beware of job frauds: Cyber experts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక అవసరాలను బలహీ­నతగా చేసుకుని కొంతమంది సైబర్‌నేరాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో ఆకర్షణీ యమైన వేతనం, తక్కువ శ్రమ అంటూ ఇంటర్నె ట్‌లో ఆన్‌లైన్‌ జాబ్స్‌ పేరిట ఇచ్చే ఉద్యోగ నోటిఫికే షన్లు ఒకటి. ఆన్‌లైన్‌ జాబ్స్‌ పేరిట ఇచ్చే ఉద్యోగ ప్రకటనలతో ఎంతోమందిని ఆకర్షించి వారి నుంచి తెలివిగా డబ్బులు గుంజడం, ఆపై కనిపించకుండా తప్పుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. అటువంటి ఊదరగొట్టే ఉద్యోగ ప్రకటనల వెనుక మోసం దాగి ఉన్నట్లు గ్రహించాలని సైబర్‌ భద్రత నిపుణులు సూచిస్తున్నారు.

భారీగా ఆదాయం అంటూ ప్రకటనలు ఇస్తున్నారంటే దాని వెనుక సైబర్‌ నేరగాళ్లు మన వ్యక్తి గత, బ్యాంకు సమాచారం కోసం మాటు వేసి ఉన్నారని పసిగట్టాలని సైబర్‌ భద్రత నిపుణులు చెబుతున్నా రు. ఎక్కువగా ఉద్యోగావకాశాల కోసం, ఆన్‌లైన్‌ జాబ్స్‌ కోసం ఇంటర్నెట్‌లో వెదికేవారిని సైతం సైబ ర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసు కుంటున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఉద్యోగం పేరిట మెయిల్స్‌ లేదా మొబైల్స్‌కు లింక్స్‌ పంపిస్తా రని, వాటిని ఏమాత్రం క్లిక్‌ చేసినా మన సమాచార మంతా వారు తెలుసు­కుని అకౌంట్లలోని డబ్బుల్ని ఊడ్చేస్తారని చెబుతున్నారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటం పెద్ద కష్టమేమీ కాదని వారు సూచిస్తున్నారు. 

ఇవీ సూచనలు..
► ఆన్‌లైన్‌ జాబ్‌ ఆఫర్‌లో మనం చేసే పనికి సాధారణం కంటే ఎక్కువ లబ్ధి వచ్చేలా, అత్యధిక సంపాదన ఉండేలా సమాచారం ఉంటే అది మోసమని గ్రహించాలి. 

► ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరిట వచ్చే ఈమెయిల్స్‌లో అక్షర దోషాలు ఉన్నా, ఎలాంటి ఫోన్‌ నంబర్లు లేకుండా ఉన్నా కచ్చితంగా అది మోసపూరితమైన లింక్‌ అని పసిగట్టాలి. 
​​​​​​​► ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు చేస్తామంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దు. 
​​​​​​​► ఆన్‌లైన్‌ జాబ్‌ ఇవ్వాలంటే వ్యక్తిగత సమాచారంతోపాటు పాన్, ఆధార్‌ కార్డు, బ్యాంకు వివరాలు షేర్‌ చేయాలని కోరుతున్నారంటే అది మోసమని గ్రహించాలి. 
​​​​​​​► ఆన్‌లైన్‌లో జాబ్‌ ఇస్తామని ప్రకటనల  రూపంలో వచ్చే వెబ్‌లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దు.

Advertisement

తప్పక చదవండి

Advertisement