అత్తకు కోడలు అంతిమ సంస్కారాలు

Bayyaram Woman Performs Last Rites of Mother in Law After Sons Refuses - Sakshi

పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న వీరిద్దరు మహిళలు. కన్నతల్లి శవాన్ని తాకడానికి కొడుకే భయపడగా, కోడలే తోడుగా నిలిచి మరో మహిళతో కలిసి అత్త అంత్యక్రియలు పూర్తిచేసింది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లికి చెందిన కె.బుచ్చమ్మ (75)కు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు చనిపోగా, అతని భార్య సునీత అత్త బుచ్చమ్మతో కలిసి ఉంటోంది.

బుచ్చమ్మ సోమవారం కరోనాతో ఇంట్లోనే చనిపోయింది. ఇది తెలిసి ఆమె రెండో కుమారుడు భయంతో పారిపోయాడు. ఇద్దరు కుమార్తెలున్నా.. కరోనాతో బాధపడుతూ బయటకు రాలేని పరిస్థితి.. దీంతో సునీత.. గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగావత్‌ శిరీషతో కలిసి పీపీఈ కిట్లు ధరించి అత్త మృతదేహాన్ని జేసీబీతో గ్రామ శివారుకు తరలించి.. అంత్యక్రియలు పూర్తిచేసింది.
– బయ్యారం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top