హైదరాబాద్‌లో మరో లిఫ్ట్‌ ప్రమాదం.. ఆర్‌ఎంపీ డాక్టర్‌ మృతి | Another Lift Accident In Suraram Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరో లిఫ్ట్‌ ప్రమాదం.. ఆర్‌ఎంపీ డాక్టర్‌ మృతి

Apr 13 2025 7:03 PM | Updated on Apr 13 2025 9:26 PM

Another Lift Accident In Suraram Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మరో లిఫ్ట్‌ ప్రమాదం జరిగింది. సూరారంలోని ఓ రెసిడెన్సీలో లిఫ్ట్‌ మీద పడటంతో అక్బర్‌ పాటిల్‌ (39) అనే ఆర్‌ఎంపీ వైద్యుడు మృతి చెందారు. అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్‌ పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

నగరంలో వరుస లిఫ్ట్‌ ప్రమాదాలు భయపెడుతున్నాయి. గత నెలలో నాంపల్లిలో లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన తెలిసిందే. మరో ఘటనలో మెహదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిధి సంతోష్‌నగర్‌కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించడం విషాదం నింపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement