
హైదరాబాద్: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కోశాధికారిగా టీవీ అలెగ్జాండర్(అలెక్స్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలెగ్జాండర్ తెలుగు సినీ స్టంట్ డైరెక్టర్స్ అండ్ స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్‌లో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ మేరకు సోమవారం ఫెడరేష్ కార్యాలయంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ ఆయనకు నియామక పత్రం అందజేశారు.
అనంతరం ఇందిరానగర్‌లోని స్టంట్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టంట్ డైరెక్టర్స్, స్టంట్ ఆర్టిస్టులో అలెగ్జాండర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అలెగ్జాండర్ మాట్లాడుతూ సినీ కార్మికుల సమస్యలపై సినీ పెద్దలతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టంట్ యూనియన్ అధ్యక్షుడు పి.ఎన్. బాజి, ట్రెజరర్ రమేష్ రాజా, సలహాదారు నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు జెల్లా మధుసూదన్, జి. మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు ఎం.అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.