ఒంటరిగానే మజ్లిస్‌..

AIMIM Party All Set To contest Alone In GHMC Elections 2020 - Sakshi

మెజార్టీ సిట్టింగ్‌లకు మళ్లీ చాన్స్

కొత్త వారికి సైతం అవకాశం 

బయటికి వెళ్లిన వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకుంటున్న వైనం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో దోస్తీ ఉన్నా బల్దియా ఎన్నికల్లో మాత్రం గతంలోలానే బరిలో దిగేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం కల్గిన డివిజన్లతోపాటు బలమైన స్థానాల్లో సైతం బరిలో దిగేందుకు అభ్యర్థులను ఖరారు చేసింది. 
 – సాక్షి, సిటీబ్యూరో

సాక్షి, హైదరాబాద్‌ : వాస్తవంగా గత ఎన్నికల్లో 60 స్థానాలకు పోటీ చేసి 44 డివిజన్లు దక్కించుకుంది. ఈ సారి అదనంగా మరో ఆరు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మెజార్టీ సిట్టింగ్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా... కొన్ని సిట్టింగ్‌ స్థానాల్లో కొత్త వారికి మౌఖిక అదేశాలు జారి చేసింది.  జై మీమ్‌–జై భీమ్‌ నినాదంతో కొత్త నగరంతో పాటు శివారు డివిజన్లలో సైతం పాగా వేసేందుకు అభ్యర్థుల ఖరారులో ఆచితూచి వ్యవహరిస్తోంది.  చదవండి: ఈ ఎన్నికల్లో వారికే ఓటు వేద్దాం..

 ఘర్‌వాపిసీ... 
ఎంఐఎం వీడిన పాత కాపులను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నగరంలో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తుండటంతో గట్టిగా ఎదుర్కొని ఆదిలోనే అడ్డుకునే ప్రయత్నాలకు సిద్ధమైంది. గతంలో పార్టీ వీడిన ముఖ్య నేతలతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో గురువారం శాలిబండ మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌ గౌస్‌ తిరిగి మజ్లిస్‌ పార్టీలో చేరారు. ఏకంగా ఆయన పార్టీ అగ్రనేత అక్బరుద్దీన్‌ వాహనాంలో దారుస్సలాంకు వచ్చి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదే విధంగా పలు డివిజన్లలో సైతం పార్టీ వీడిన వారిని తిరిగి రప్పించే విధంగా చర్యలకు ఉపక్రమించింది. చదవండి: గ్రేటర్‌ ఎన్నికలు: నేను.. నా నేర చరిత!

సందడే.. సందడి 
మజ్లిస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సలాం పార్టీ శ్రేణులతో సందడిగా మారింది ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఆశావహుల తాకిడి పెరిగింది. ఒక వైపు కొత్తవారు.. మరోవైపు గ్రీన్‌ సిగ్నల్‌ లభించిన వారితో కిటకిట లాడుతోంది. పార్టీ శ్రేణులు గ్రీన్‌ సిగ్నిల్‌ లభించిన అభ్యర్థులతో పాటు పార్టీ అధినేతలకు పూలమాలలతో ముంచెత్తుతున్నాయి. 

సొంతగూటికి మహ్మద్‌ గౌస్
చార్మినార్‌: జీహెచ్‌ఎంసీ మజ్లిస్‌ పార్టీ మాజీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, శాలిబండ మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌ గౌస్‌ సొంత గూటికి చేరారు. 2016లో మజ్లిస్‌కి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన ఆయన గురువారం తిరిగి మజ్లిస్‌ పార్టీలో చేరారు.  గురువారం దారుస్సలాంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ సమక్షంలో మహ్మద్‌ గౌస్‌ మజ్లిస్‌ పార్టీలో చేరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top