అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేయాలి: రాఘవులు | Agnipath Scheme Should Be Abolished: B V Raghavulu | Sakshi
Sakshi News home page

అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేయాలి: రాఘవులు

Jun 18 2022 3:12 AM | Updated on Jun 18 2022 2:41 PM

Agnipath Scheme Should Be Abolished: B V Raghavulu - Sakshi

సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్‌): బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా, సికింద్రాబాద్‌లో జరిగిన కాల్పులను ఖండిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ దేశ సేవ, భద్రత కోసం పనిచేసే వారికి భద్రత లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement