ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ షీటీమ్స్‌ | Additional DGP Swati Lakra About Telangana She Team | Sakshi
Sakshi News home page

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ షీటీమ్స్‌

Jan 9 2023 2:15 AM | Updated on Jan 9 2023 9:36 AM

Additional DGP Swati Lakra About Telangana She Team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలు, యువతుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీటీమ్స్‌ దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా పేర్కొన్నారు. ఢిల్లీలో ఈనెల 5 నుంచి 7 వరకు నిర్వహించిన సీఎస్‌ల కాన్ఫరెన్స్‌లో ఇదే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిపారు.

ఈ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో కలిసి తీసుకున్న గ్రూప్‌ ఫొటోను ట్విట్టర్‌లో స్వాతి లక్రా షేర్‌ చేశారు. తెలంగాణ షీటీమ్స్‌ దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు బెస్ట్‌ ప్రాక్టీస్‌గా నిలిచిందని, ఇతర రాష్ట్రాల్లోనూ షీటీమ్స్‌ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం వెల్లడైనట్లు ఆమె వెల్లడించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement