హైదరాబాద్: గాందీనగర్ ఎస్‌ఐ నర్సింహులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ కథనం ప్రకారం.. సంజీవ్‌సింగ్ ఠాకూర్ అనే వ్యక్తికి సోదరుడితో వ్యాపార లావాదేవీలకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 11న సోదరుడి ఫిర్యాదు మేరకు సంజీవ్‌సింగ్ ఠాకూర్‌పై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో తనకు ఫేవర్ చేయాలంటూ సంజీవ్‌సింగ్ ఠాకూర్ ఎస్.ఐ నర్సింహులుతో రూ.లక్షకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేరకు మంగళవారం కవాడిగూడలో ఎస్‌ఐ మొదటివిడతగా రూ.50 వేలు తీసుకుంటుండగా వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీఎస్పీ వివరించారు. నర్సింహులుపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.


