ప్రభుత్వ పాఠశాలల మూసివేత తగదు | Academicians Intellectuals and Civil Society Open Letter To CM Revanth | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల మూసివేత తగదు

Jul 7 2026 11:45 PM | Updated on Jul 7 2026 11:45 PM

Academicians Intellectuals and Civil Society Open Letter To CM Revanth
  • ప్రైవేటు పాఠశాలలను నియంత్రించాలి
  • ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి
  • ముఖ్యమంత్రికి విద్యావేత్తలు, మేధావులు, పౌర సమాజం బహిరంగ  బహిరంగ లేఖ

హైదరాబాద్‌:  రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బెంగళూరులో ద హిందూ హడల్ కాంక్లేవులో ప్రకటించడాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ విద్యావేత్తలు, మేధావులు, ప్రముఖ కవులు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. తక్షణమే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వంద మందికి పైగా వివిధ రంగాలకు చెందిన మేధావులు ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను రాశారు. 

ఈరోజు మంగళవారం జులై 7 2026 రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో పత్రికా విలేఖరుల సమావేశాన్ని నిర్వహించి బహిరంగ లేఖను విడుదల చేశారు.  ఇందులో గ్రామీణ ప్రాంతంలో విస్తరించి ఉన్న 23 వేల బడుల మూసివేతను ఉపసంహరించుకోవాలని, విశృంఖలంగా పెరిగిపోతున్న విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణను నియంత్రించాలని, అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టాలని మరియు అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, సరిపడా టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. 

మీడియా సమావేశంలో ప్రముఖ పాత్రికేయుడు సంపాదకులు కే రామచంద్ర మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్రంలో విద్యార్థులు లేరని 23 వేల పాఠశాలల మూసివేసే ఆలోచన తగదని, బడులను కుదిస్తే ప్రజలు విద్యకు దూరం చేసినట్లు అవుతుందని తెలిపారు.

నాక్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని అలాగే రాజకీయాలలో విద్య లేదని కానీ విద్యలో రాజకీయాలు ఎక్కువైపోయాయని ఆ కారణంగానే సామాజిక అవసరాలు గుర్తించకుండా పాఠశాలల మూసివేత ప్రకటన చేశారని దుయ్యబట్టారు.

జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నదనే నెపంతో పాఠశాలల మూసివేత నిర్ణయాలు గైకొనడం సరికాదని వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలేంటో శాస్త్రీయంగా అధ్యయనం చేశారా అని ప్రశ్నించారు.

ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి ప్రసంగిస్తూ విద్యకు 15% నిధులు కేటాయిస్తామని గత ప్రభుత్వ మూసివేసిన 6000 పాఠశాలలను తెరిపిస్తామని తమ మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక బడ్జెట్ కేవలం 8.2% మాత్రమే కేటాయించి మరియు ఏకంగా 23 వేల పాఠశాలలను మూసివేస్తామని ప్రకటించడం ప్రజలను ప్రజలను వహించడమే కాగలదన్నారు.

కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ 23 వేల పాఠశాలల మూసివేత ద్వారా ఉత్పన్నమయ్యే పరిణామాల పట్ల భయంగొల్పుతున్నదని సాక్షాత్తు ముఖ్యమంత్రి విద్యామంత్రిగా ఉంటూ ఇలాంటి తిరోగమన నిర్ణయాలు తీసుకోవడం పట్ల తన ఆక్షేపణ ప్రకటించారు.

హైకోర్టు సీనియర్ అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వము లాగానే నేటి ప్రభుత్వం కూడా ప్రజాస్వామికంగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని రాజ్యాంగ పరిధిలో ప్రజా పాలన అందిస్తామని ప్రకటించి ఏకపక్షంగా 23 వేల పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించడాన్ని తప్పు పట్టారు ఆర్టిఈ చట్టం ప్రకారం గ్రామానికి పాఠశాల ఉండాలని డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement