తెలంగాణలో 80 వేలు దాటిన కరోనా కేసులు | 1256 New Coronavirus Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 80 వేలు దాటిన కరోనా కేసులు

Aug 10 2020 9:22 AM | Updated on Aug 10 2020 11:26 AM

1256 New Coronavirus Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సోమవారం వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 1,587 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 57,586గా ఉంది. కరోనాతో మరో 10 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 637కు పెరిగింది. (కరోనా ఉంది.. శవాన్ని ఇటు తేవొద్దు..!)

ప్రస్తుతం తెలంగాణలో 22,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 389 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం 11,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,24,840 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో రికవరీ రేటు 71.31 శాతంగా ఉంది. కాగా జాతీయస్థాయిలో రికవరీ రేటు 68.78శాతం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement