రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు | Sakshi
Sakshi News home page

రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు

Published Thu, Jul 6 2023 3:50 AM

There will be heavy rains for the next two days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో విస్తా రంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఈ సీజన్‌లో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం...
నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌ 1వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు 15.4 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో వర్షాలు మందగించాయి. దీంతో రాష్ట్రంలో లో టు వర్షపాతం ఉంది. ఈ సీజన్‌లో సాధారణ వర్ష పాతం కంటే 32శాతం లోటు వర్షపాతం నమో దైన ట్లు వాతావరణ శాఖ తెలిపింది.

బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 2.51 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అ త్య ధికంగా సిద్దిపేట జిల్లాలో 6.24 సెంటీమీటర్లు, జనగామ జిల్లాలో 6.21 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లాలో 4.71 సెంటీమీటర్లు, నిర్మల్‌ జిల్లాలో 4.60 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Advertisement
Advertisement