Telangana: Boath MLA Rathod Bapurao Met Road Accident - Sakshi
Sakshi News home page

బోథ్ ఎమ్మెల్యేకి తప్పిన పెను ప్రమాదం

Jun 24 2023 7:10 PM | Updated on Jun 24 2023 8:08 PM

Telangana: Boath Mla Rathod Bapurao Met Road Accident - Sakshi

సాక్షి, అదిలాబాద్‌: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు ప్రమాదానికి గురి కాగా.. తాజాగా బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు పెను ప్రమాదం తప్పింది. శనివారం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. 

వివరాల ప్రకారం.. హైదారాబాద్ నుండి ఆదిలాబాద్ వస్తుండగా నిర్మల్ బైపాస్ సమీపంలో కొరటికల్ కార్నర్ వద్ద అకస్మాత్తుగా ఆవు అడ్డం వచ్చింది. దీంతో ఆవును తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జు నుజ్జు కాగా.. ఎమ్మెల్యే చేతివేలికి గాయమై తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే మరో వాహనంలో ఆయనను బోథ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే బాపురావు ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

చదవండి: ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల పంచాయితీ.. నిధుల వాడకం వ్యాఖ్యలు మరింత మైనస్‌? బీజేపీ శ్రేణుల్లో ఆందోళన!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement