పంటలకు మద్దతు ధర అరకొరేనా!

Agriculture department said support prices are not promising - Sakshi

స్వామినాథన్‌ సిఫార్సులు దేవుడెరుగు.. 

అసలు సాగు ఖర్చులు కూడా ఇవ్వలేని కేంద్ర ఎంఎస్‌పీ 

రాష్ట్ర ప్రభుత్వం పత్తికి అడిగింది రూ. 16,500 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రూ. 7,020 

వరికి క్వింటాలుకు రాష్ట్రం అడిగింది రూ. 5,100 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,203 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పంటలకు మద్దతు ధరలు ఆశాజనకంగా లేవని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. వివిధ పంటల సాగు ఖ ర్చుల ప్రకారం స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయా లని తాము కోరితే కేంద్రం పెడచెవిన పెట్టిందని అంటున్నాయి.

కేంద్రం విదిల్చే లెక్క ప్రకారం రైతులు పండించిన పంటకు వచ్చేది నష్టమే తప్ప లాభం లేదని అంటున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ సీజన్లలో రైతు లు పండించే పంటలకు కేంద్రం బుధవారం ప్రకటించిన కొత్త మద్దతు ధరలు భరోసా ఇచ్చే పరిస్థితి లేదంటున్నాయి.  

సీఏసీపీకి ఇచ్చిన నివేదికల ప్రకారం..: రాష్ట్రంలో రైతులు పంటల సాగుకు పెడుతున్న పెట్టుబడి ఖర్చులపై రాష్ట్ర వ్యవ సాయశాఖ భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ (సీఏసీపీ)కి నివేదించింది. సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ పంపిన నివేదికల ప్రకారం తెలంగాణలో క్వింటా వరి సాధారణ (కామన్‌) రకం ధాన్యానికి రూ. 3,300, ఏ గ్రేడ్‌ ధాన్యం పండించాలంటే రూ. 3,400, పత్తికి రూ. 11 వేలు, మొక్కజొ న్నకు రూ. 2 వేలు, సోయా పంటకు రూ. 4,500 రైతు గతే డాది ఖర్చు చేశారు.

ఈ ఖర్చులకు స్వా మినాధన్‌ సిఫార్సుల ప్రకారం 50 శాతం అదనంగా కలపాల ని రాష్ట్రం సూచించింది. ఆ ప్రకారం మద్దతు ధరలను ఖరా రు చేయాలని కోరింది. ఉదాహరణకు పత్తి క్వింటాకు రూ. 11 వేలు ఖర్చు అయి తే, స్వామినాధన్‌ సిఫార్సుల ప్రకారం అందులో 50 శాతం కలపాలి. ఆ ప్రకారం మద్దతు ధరగా రూ. 16,500 ప్రకటించాలని రాష్ట్రం ప్రతిపాదించింది. అయితే కేంద్రం పత్తికి మద్ద తు ధర కేవలం రూ. 7,020 మాత్రమే ఖరారు చేసింది.

స్వామినాధన్‌ సిఫార్సులను పక్కన పెట్టినా వాస్తవ  ఖర్చు ప్రకారమైనా మద్దతు ధర ప్రకటించలేదన్న విమర్శలు ఉన్నాయి. స్వామినాథన్‌ సిఫార్సులు అమలుచేస్తున్నామని కేంద్రం చెప్పుకుంటోంది. కానీ క్షేత్రసాయి లెక్కలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top